YSR KADAPA - సమాచారం / వైయస్‌ఆర్ : జిల్లా కలెక్టరుగా లోతేటి శివశంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు కలెక్టరుగా పనిచేసిన శివశంకర్ విజయనగరం జిల్లాకు చెందిన వారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. గతంలో పాడేరు సబ్ కలెక్టర్‌గానూ, ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిగా, సీతంపేట ఐటీడీఏ పీవోగా పని చేశారు. గుంటూరు సబ్ కలెక్టరుగా, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల సంయుక్త కలెక్టరుగా పనిచేసిన అనుభవం ఉంది.
YSR KADAPA